Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాసేప‌ట్లో కేజ్రీవాల్ ఇంటికి కేసీఆర్

kcr to visit kejriwal home
  • దేశ వ్యాప్త పర్యటనలో ఉన్న కేసీఆర్
  • మ‌ధ్యాహ్నం కేజ్రీవాల్‌తో క‌లిసి భోజనం
  • అనంత‌రం చండీగ‌ఢ్ కు సీఎంలు
దేశ వ్యాప్త పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేప‌ట్లో ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ఇంటికి వెళ్ల‌నున్నారు. కేజ్రీవాల్‌తో చ‌ర్చించి మ‌ధ్యాహ్నం భోజనం చేసిన అనంత‌రం చండీగ‌ఢ్ వెళ్ల‌నున్నారు. సాగు చ‌ట్టాలపై పోరులో అమ‌రులైన రైతుల కుటుంబాల‌ను ఇరువురు సీఎంలు ప‌రామ‌ర్శిస్తారు. వారికి ఆర్థిక సాయం చేస్తారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ కూడా పాల్గొన‌నున్నారు. 

600 కుటుంబాల‌కు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందించ‌నున్నారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేసీఆర్ మ‌రికొంద‌రు కీల‌క నేత‌ల‌తో స‌మావేశం కానున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న‌ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో సమావేశమైన విష‌యం తెలిసిందే. దేశ ప‌రిస్థితులు, ప్రాంతీయ పార్టీల బ‌లాలు, దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన వంటి అంశాల‌పై వారు చ‌ర్చిస్తున్నారు. 


KCR
Arvind Kejriwal
TRS

More Telugu News